తీరు మార్చుకోని లేడీ పోలీస్‌ ఆఫీసర్‌...నకిలీ ఏసీబీ అధికారి పేరిట బెదిరింపులు

 

వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఇన్స్పెక్టర్ స్వర్ణలత మరొకసారి పోలీసులకు చిక్కింది. పోలీస్ అధికారుల సంఘం ఉపాధ్యక్షురాలుగా టిడిపి నాయకులపై తీవ్ర హెచ్చరికలు చేసిన ఆమె చివరికి ఒక నకిలీ ఏసీబీ అధికారికి సహకరించి పట్టుబడింది. గతంలో విశాఖలో ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన స్వర్ణలత ప్రస్తుతం గుంటూరు ఏఆర్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయంలో ఆ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు సన్నిహితంగా మెలిగింది. దీంతో ఆమె హడావుడి ఉత్తరాంధ్రలో మహారాణిల సాగింది. ఆ సమయంలో నోట్ల రద్దుతో ప్రజాప్రతినిధి నోట్లను మార్పిస్తానంటూ తన సొంత వాహనంలో తరలిస్తూ పోలీసులకు చిక్కింది. 


ఈమెకు సహకరించిన డ్రైవర్ కానిస్టేబుల్ తో పాటు స్వర్ణ లత ను  అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు.  బెయిల్ లభించడంతో  గుంటూరులో ఆమె పోస్టింగ్ పొందారు ఈ దశలో ఇటీవల బాలకృష్ణ అనే వ్యక్తి జీవీఎంసీ... సబ్ రిజిస్టర్ ఆఫీసుల వద్ద తాను ఏసీబీ అధికారి అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అనుమానం వచ్చిన సబ్ రిజిస్టార్ నిలదీయగా తాను ఏసీబీ అధికారిని అవునో కాదో నిర్ధారించుకోమంటూ స్వర్ణలతకు ఫోన్ చేసి మాట్లాడించారు. ఆమె బాలకృష్ణ ఏసీబీ అధికారి ఆయన చెప్పినట్టు నడుచుకోండి అని సలహా ఇచ్చింది. కానీ సబ్ రిజిస్ట్రా ర్ అనుమానంతో ఏసీబీ అధికారులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. ఈ దశలో బాలకృష్ణ ఏ ఆర్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత కలిసి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో బాలకృష్ణతో పాటు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 


సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో పోలీస్ శాఖలోకి చేరిన ఆమె తొలి దశ నుంచి వివాదాస్పద అధికారిగా కొనసాగారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకుల పై తీవ్ర విమర్శలు ఆమె చేసిన విషయాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. విశాఖపట్నం మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రపాణిని బెదిరించిన కేసులోనూ స్వర్ణలత పాత్ర ఉన్నట్లు తేల్చారు పోలీసులు. నకిలీ ఏసీబీ ఇన్స్‌పెక్టర్‌ సుధాకర్‌ను అడ్డుపెట్టుకుని డబ్బు కోసం సబ్ రిజిస్ట్రార్‌ని బెదిరించినట్లు తేల్చారు. సుధాకర్‌ కాల్‌ లిస్ట్‌ ద్వారా స్వర్ణలత బండారాన్ని బయటపెట్టారు. గతంలో 2000 రూపాయల నోట్ల మార్పిడి కేసులో అరెస్టయ్యారు స్వర్ణలత. సినిమాల్లో నటించాలన్న పిచ్చితో డబ్బులు కూడగట్టేందుకు దొంగ పోలీస్ అవతారమెత్తారు. నటనలో శిక్షణ తీసుకోవడమే కాదు… డ్యాన్సులు నేర్చుకున్నారు. అంతేకాదు ఏపీ 31పేరుతో ఓ సినిమా పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. ఆమె డ్యాన్స్ వీడియోలు, సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu