సూదిగాడు మళ్లీ వచ్చేశాడు..
posted on Dec 5, 2015 4:03PM

మూడు నెలల క్రితం సూది సైకో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కనీసం జనాలు బయటకు వెళ్లాలంటే బయపడే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఎటునుండి వస్తాడో.. ఎలా దాడి చేస్తాడో తెలియక అందరూ బయపడేవాళ్లు. పోలీసులు అతని కోసం వెతికి ఆఖరికి ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉండిపోయారు. అయితే కొద్దిరోజుల నుండి సూది సైకో సైలెంట్ అయిపోయాడు. దీంతో పోలీసులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాన్ని ఇప్పుడు సూది సైకో మరోసారి కలకలం రేపాడు. హైదరాబాద్ లో సూది సైకో ఓ మహిళపై దాడి చేయడంతో కలకలం రేగింది. వనస్థలీ పురంలో ఓ మహిళకు సూది గుచ్చి సూది సైకో పరారయ్యాడు. దీంతో మహిళకు తీవ్ర గాయాలవ్వగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు మళ్లీ అలెర్ట్ అయి సూది సైకో కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.