గుజరాత్‌లో బీజేపీ ఆధిక్యం.. సీఎం గెలుస్తాడా..?

 

ఎగ్జిట్ పోల్స్ సర్వేలను నిజం చేస్తూ గుజరాత్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం కషాయం 85 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. హస్తం గట్టి పోటినిస్తూ 73 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గెలుపుపై పార్టీ కార్యకర్తలు కొంత టెన్షన్ పడుతున్నారు. రాజ్‌కోట్ వెస్ట్‌లో సీఎం విజయ్‌ రూపానీపై కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనీల్ రాజ్‌గురు ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ పోటీ నువ్వా..? నేనా..? అన్నట్లు ఉండటంతో ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu