వలసవచ్చిన పాకిస్థానీయులకు భారత పౌరసత్వం..
posted on Jun 3, 2016 5:52PM
.jpg)
భారత్‌లోకి అక్రమంగా వలస వచ్చి స్థిరపడిన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన హిందువులకు భారత ప్రభుత్వం ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. వారందరికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు హోంమంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఈ రెండు దేశాల్లో ముస్లింల జనాభా ఎక్కువ. దీంతో ఈ దేశాలలోని ముస్లింల వేధింపులతో వేలాదిమంది శరణార్థులు భారత్‌కు వలస వచ్చి వివిధ రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. ఈ నేపథ్యంలో వీరందరికి పౌరసత్వం ఇవ్వాలని హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అందుకుగాను 1955 పౌరసత్వచట్టానికి సవరణలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది అమల్లోకి వస్తే ఆ రెండు దేశాల నుంచి వలస వచ్చిన సుమారు 2 లక్షల మంది హిందువులు లబ్థిపొందే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.