ప్ర‌జాస్వామ్యానికి త‌ల‌మానికం భార‌త్.. ప్ర‌ధాని మోది

భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నేటి ఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగరేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ దేశ ప్రజలకు స్వాతంత్య్ర వజ్రోత్సవ శుభా కాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, అమృత్ మహోత్సవాల సందర్భంగా కొత్త దశ, దిశను ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మన ముందున్న మార్గం కఠినమై న‌ద‌ని, ప్రతి లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత్ స్వతం త్రంగా మనుగడ సాగించలేదని, ముక్కలు చెక్కలు అవుతుందన్న‌ వారి అభిప్రాయం తప్పని నిరూపించామన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి దన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన బలమని ప్రధాని మోదీ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతోందని, అమృ త మహోత్సవ వేళ భారతీయులందరికీ  స్వాతంత్ర్య దినో త్సవ శుభాకాంక్షలు చెప్పారు.  ఈ సందర్భంగా దేశ స్వాతం త్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవస రం ఉందన్నారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్‌లకు మనం రుణపడి ఉండాలన్నారు.  దేశంలోని ప్రతి ఒక్క పేద వారికీ సాయం అందేలా చూడటమే తన జీవిత లక్ష్యమన్నారు. 130 కోట్ల మంది ప్రజలు రాజకీయ సుస్థిరత ఫలాలను చూస్తు న్నా రన్న ప్రధాని.. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అవుతున్నారన్నారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌లో ప్రైవేటు రంగానిది కూడా కీలక పాత్రని, ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఈ దశాబ్దం ఖచ్చితంగా టెక్నాలజీదేనని, దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. జైజవాన్‌, జైకిసాన్‌, జై విజ్ఞాన్‌తో పాటు జై అనుసంధాన్‌ అన్నారు. రసాయన ఎరువులపై ఆధారపడడం తగ్గించాలని ప్రధాని మోదీ సూచించారు.

వికసిత భారతం, బానిసత్వ నిర్మూలన, వారసత్వం, ఏకత్వం, పౌర బాధ్యత ఇవే మన పంచప్రాణాలని ప్రధాని మోదీ వ్యాఖ్యా నించారు. వచ్చే 25 ఏళ్లు  పంచప్రాణాలుగా భావించి అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపిచ్చారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్‌లు మన ప్రతిభకు నిదర్శనమన్న ప్రధాని మోదీ..రెండు, మూడు స్థాయిల్లోని నగరాల నుంచి కూడా  ప్రతిభ వెలుగులోకి వస్తోంద న్నారు. మన సామర్థ్యాలపై మనం విశ్వాసం ఉంచాలన్నారు. మన దేశం ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించింద న్నారు. ప్రపంచ అవ సరాలను తీర్చే సత్తా భారత్‌కు ఉందన్నారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌మ ప్ర‌సంగానికి ముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనం తరం ఎర్ర కోటకు చేరుకున్న ప్రధాని మోదీకి.. త్రివర్ణ దళాల చీఫ్‌ల సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని మోదీ స్వీకరించారు. గన్ సెల్యూట్ కోసం తొలిసారిగా దేశీయంగా రూపొందించిన హౌవిట్జర్ తుపాకులను ఉపయో గిస్తున్నారు. స్పెషల్ యూత్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌లో భాగంగా.. 14 దేశాలకు చెందిన 26 మంది ఆఫీసర్లు, 127 మంది క్యాడెట్లు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇండిపెండెన్స్ డే వేడుకల సందర్భంగా దేశ రాజ ధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పది వేల మందికిపైగా భద్రతా సిబ్బందితో ఎర్రకోట వద్ద బహుళ అంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.