మద్రాస్ ఐఐటీ బీఫ్ ఫెస్టివల్... క్యాంపస్ లో ఉద్రిక్తత..
posted on May 31, 2017 1:23PM
.jpg)
తమిళనాడు ఐఐటీలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐఐటీలో బీఫ్ విందు ఏర్పాటు చేసిన కొంతమంది విద్యార్థులపై దాడి జరిపారు. ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి సూరజ్ ఈ విందు ఏర్పాటు చేయగా.. మరో వర్గం విద్యార్దులు వారిపై దాడి జరిపారు. ఈ దాడిలో సూరజ్ తీవ్రంగా గాయపడగా.. అతని కంటి చూపు కూడా కోల్పోయినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. ఈ దాడిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ కళాశాల డీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇనిస్టిట్యూట్ ఎదుట బైఠాయించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు అక్కడి చేరుకున్నారు. వారిని బలవంతంగా నిరసన విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
