ఆ నిషేధం వస్తే, ఏపీలో సగం ఖాళీ!
posted on Sep 29, 2022 11:52AM
ఎవరూ పట్టించుకోవడం లేదని అస్తవ్యస్తంగా వ్యవహరిస్తుంటే ఏ మూలనుంచో ఊరూ పేరూ లేనివాడు ఓ కత్తి పట్టుకుని అమాంతం దాడిచేసిపోతాడు.. ఇదో పాత సినిమా డైలాగు. ఇది ఇప్పుడు న్న రాజకీయ నాయకుల వ్యవహారశైలికి అచ్చుగుద్దినట్టు నప్పుతుంది. తీవ్రనేరారోపణలు ఉన్నవారు వాస్తవానికి ప్రజా ప్రతినిధులు కావడానికి వీల్లేదు. ఇది చట్టంలోనే ఉందా లేదా అనే చర్చ కంటే అసలు రాజకీయ నాయ కునిగా ఎదగడానికి ఆలోచనలు చేసేవారు, నలుగురితో ప్రచారం చేయించుకునేవారు తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్న. పెళ్లిచూపుల్లో అబ్బాయి గురించి, అమ్మాయి గురించి వేయి ప్రశ్నలు వేస్తు న్నట్టే... ప్రజలూ తమ ప్రతినిధిని అడగవచ్చు. కానీ ఆ అవకాశం ఎవ్వరూ, ఎన్నడూ ఇవ్వరు. కేవలం పార్టీ అధి నేతలు, సీనియర్లు ఒక వ్యక్తిని తమ పార్టీ అభ్యర్ధిగా అనుకుని ఎన్నికల్లో కోట్లు తగలేసి గెలిపించు కుంటా రు. అదే కావాలి. ఆ తర్వాత ఆ హేమా హేమీ ఎలాంటి పనులు చేసినా, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహ రించినా పార్టీ కార్యాలయం కాపాడేస్తుంది. అదుగో ఆ నమ్మకంతోనే మళ్లీ ఎన్నికల్లో అదే ధైర్యంతో ఓట్లు అడుగుతు న్నారు. ఇన్నాళ్లకు ఓ వ్యక్తి అసలు ఇలాంటి చోద్యాలు చూడదల్చుకోలేదంటూ సుప్రీం కోర్టు మెట్లెక్కాడు.
ఎన్నికల్లో అభ్యర్ధిత్వానికి బొత్తిగ అనర్హుడైనవాడు, ముఖ్యంగా సివిల్, క్రిమినల్ కేసుల్లో పీకల్లోతు ఉండి కోర్టు పక్షిగా మారిన వారికి ఎన్నికల్లో పోటీచేసే వీలు కల్పించవద్దని కోరుతూ ప్రము ఖ న్యాయవాది అశ్వి నీ కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరిం చింది. న్యాయమూర్తులు జస్టిస్ కె.ఎం. జోసెఫ్, హృషికేష్ రాయ్ తో కూడిన బెంచ్ కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖ, ఎన్నికల కమిషన్ కు నోటీసులుజారీ చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని లా కమిషన్ తన 244వ నివేదికలో తెలిపిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో సగానికి పైగా ప్రజా ప్రతినిధులు ఇంటి దారి పట్టాల్సిందే మరి. కారణమేమంటే, ఇప్పటికే కోర్టు కేసులు, ఈడి విచారణలతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆ స్థానానికి అనర్హుడన్న ముద్ర ప డింది. ఆయన కోర్టుకు తన లాయర్లను పంపిస్తూ చాలాకాలం కేసులకు కోర్టు హాజరును తప్పించుకుం టూ వచ్చారు. అంతకు మించి జైలు జీవితం అనుభవించారు కూడా. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండ డం ఎంతవరకూ సబబ?, ఎంతసేపటికి ఉత్తరప్రదేశ్, బీహార్ రాజకీయనాయకుల గురించి ప్రస్తావి స్తున్న ప్రజలు, కోర్టులు, న్యాయస్థానాలు మరి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధన వర్తించదా అని రాజకీయపరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాభీష్టం మేరకే పాలన సాగిస్తు న్నారా లేదా అన్నదాని కంటే అసలు పాలకుడు సవ్యమైనవాడేనా అన్నది కీలకం. పరిపాలనా లోపాల కంటే ప్రతినిధుల చరిత్ర ఎంతో ముఖ్యం. నేరచరిత్ర ఉన్నవారిని తెలిసీ ఎన్నుకోవడం ప్రజలకు ఆత్మా హుతితో సమానమన్నారు వెనకటికి ఒక సీనియర్ నేతే అన్నారు.
ఇదే అంశంపై అసోసియేషన్ ఫర్ డెమోక్ర టిక్ రిఫార్బ్ రూపొందించిన గణాంకాలను పిటిషన్లో ప్రస్తావిం చారు. 2009 నుంచి క్రిమినల్ కేసులున్న ఎంపీల సంఖ్య 100 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 2019 సాధా రణ ఎన్నికల్లో గెలుపొందిన 539 మంది లోక్ సభ సభ్యుల్లో 233 మంది.. అంటే 43 శాతం మందిపై క్రిమినల్ కేసులు న్నాయని తెలిపారు. ఓ ఎంపీ తనపై ఏకంగా 204 క్రిమినల్ కేసులున్నట్టు వెల్లడిం చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇటీవలికాలంలో ఎన్నికల్లో పోటీచేస్తున్నవారిలో అత్యాచారాలు, హత్యలు, అత్యాచారాలకు పాల్పడిన వారు, కిడ్నాప్‌లకు పాల్పడినవారు కూడా పార్లమెంటుకు వస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. అసలు ఎన్నికల్లో పాల్గొనే ముందు ఎన్నికల కమిషన్ అలాంటివారి చరిత్ర తెలిసి కూడా అనుమతించడమే మి టని ప్రశ్నించారు. అంతకుమించి ఆయా పార్టీలే వారికి మద్దతునిచ్చి మరీ పంపిస్తున్నారని ఆరోపిం చా రు. అయితే, ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్య్రంపై మరిన్ని పరిమితులు విధించడం కష్టమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. ఆర్టికల్ 19(2)లో పేర్కొన్న భావప్రకటనా స్వేచ్ఛ పై రాజ్యాంగమే కొన్ని పరిమితుల ను కూడా విధించిందని కోర్టు తెలిపింది.
యూపీ ప్రభుప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్య్రం పై మరిన్ని పరిమితులు విధిం చడం కష్టం. ప్రభు త్వం పై రాజకీయ కుట్రలో భాగంగానే రేప్ కేసు పెట్టా రని అప్పట్లో ఓ మంత్రి వ్యాఖ్యానిం చారు. ఆ తర్వాత సదరు మంత్రి కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ప్రజా ప్రతినిధులు తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో వారి వాక్స్వా తంత్య్రంపై పరిమితులు విధించాలని పిటిషనర్ తరపు న్యాయ వాది కోర్టును అభ్యర్థించారు. ఈ అంశాన్ని నవంబరు 15న పరిశీలిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్,నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.