దానికి నేనేం చేయను: బ్రహ్మనందం 

సినీ హాస్యనటుడు బ్రహ్మానందం ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించారు. ఓటర్లకు ఏం చెబుతారు? అని వారు ప్రశ్నించారు. దానికి బ్రహ్మానందం స్పందిస్తూ... ఓటర్లకు అప్పీల్ చేసేది ఏముందమ్మా... గంటలో మొత్తం అయిపోతుంది... ప్రతి ఒక్కరు ఓటు హక్కును బాధ్యతగా భావించాలన్నారు. హైదరాబాద్‌లో తక్కువ పోలింగ్ నమోదవుతుంది కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దానికి బ్రహ్మానందం స్పందిస్తూ... దానికి నేనేం చేయనని సరదాగా అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu