తెలంగాణలో 3 గంటల వరకూ 52. 32శాతం పోలింగ్
posted on May 13, 2024 4:03PM
తెలంగాణలో పోలింగ్ ఈ సారి పుంజుకుందనే చెప్పాలి. సార్వ్రతిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 52.32 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
రాష్ట్రంలోనే అత్యధికంగా మధిరలో మధ్యాహ్నం 3 గంటలకు 63.67శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్ లో 3 గంటల వరకు 58.24 శాతం వరంగల్ లో 61.4 శాతం పోలింగ్ నమోదు అయింది. మహబూబాబాద్ ఎంపీ స్థానంలో 61.4 శాతం, పెద్దపల్లిలో 55.92 శాతం, నల్గొండ లో 59.91 శాతం పోలింగ్ నమోదైంది.
అలాగే ఆదిలాబాద్ 62.44 శాతం, మెదక్ 60.94 శాతం, నాగర్‌కర్నూల్ లో 57.17 శాతం, మహబూబ్‌నగర్ ఎంపీ నియోజకవర్గంలో 58.92 శాతం పోలింగ్ నమోదైంది. అయితే హైదరాబాద్, సికిందరాబాద్ లలో మాత్రం పోలింగ్ యధాప్రకారం స్వల్పంగానే ఉంది.