హైదరాబాద్‌లో విచిత్రం..బిచ్చగాళ్లను అపహరించిన దుండగులు

బిచ్చగాడు సినిమాలో బిచ్చగాళ్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తారు కొందరు . అచ్చం అలాంటి ఘటనే నిజ జీవితంలోనూ జరిగింది..అది కూడా మన భాగ్యనగరంలోనే..ఎల్బీనగర్‌లో    శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ప్రాంగణంలో నిద్రిస్తున్న నలుగురు బిచ్చగాళ్లను తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు వ్యాన్‌లోకి బలవంతంగా ఎక్కించుకుని పారిపోయారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన వారిని మల్లయ్య, పెంటయ్య, వెంకటమ్మ మరో మహిళగా గుర్తించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu