చందానగర్ జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి
posted on Aug 16, 2025 2:39PM

హైదారాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దోపిడీకి ఏడుగురు వ్యక్తులు వచ్చినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. నకిలీ నెంబర్ ప్లేట్లతో చోరీకి వచ్చి దొంగతనం తర్వాత నంబర్ ప్లేట్లను మార్చుకున్నారని, 10 కేజీల వెండి ఆభరణాలు దోపిడీ చేశారని డీసీపీ తెలిపారు. ఈ బీహార్ ముఠా హైదరాబాద్‌లో చేసిన తొలి చోరీ ఇదేనని, గతంలో కోల్‌కత్తా, బీహార్, కర్ణాటకలో దోపిడీకి పాల్పడినట్లు గుర్తించామన్నారు.
ఈ ఏడుగురు బీహార్ కి చెందిన వ్యక్తులని పేర్కొన్నారు. వీరిపై ఆ రాష్ట్రంలో 4, 5 కేసులు నమోదు అయ్యాయి. ఒక నిందితుడి పై 10 కేసులు ఉన్నాయిని డీసీపీ తెలిపారు.20 రోజుల క్రితం నగరానికి వచ్చారని ఆశిష్ కుమార్ సింగ్, దీపక్ కుమార్ సాహా అనే ఇద్దరు నిందితులను పూణేలో అరెస్ట్ చేశామని తెలిపారు.చోరీ జరిగిన 24 గంటలలో నిందితులను గుర్తించామన్నారు. బీహార్ నుండి వెపన్స్ కొనుగోలు చేశారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని డీసీపీ వినీత్ కుమార్ వెల్లడించారు