ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నిక
posted on Aug 16, 2025 2:18PM

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరోసారి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఇవాళ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సంఘ సభ్యులంతా చిన్నిని ప్రెసిడెంట్‌గా ప్రతిపాదించారు. అయితే, ఎలాంటి పోటీ లేకపోవడంతో ఆయనే మరోసారి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ACA ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనకు ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.
ఏసీఏ కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబు.. మరో 34 మందితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటైంది.గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులచేతుల్లోనే ఏసీఏ ఉండేది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరంతా తమ పదవులకు రాజీనామా చేశారు