హైదరాబాద్‌లో కుండపోత వర్షం..పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
posted on May 5, 2025 9:15PM

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. పగలంతా భానుడు భగభగమంటే.. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులతో పలు చోట్ల వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇవాళ హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రానికి చల్లబడింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మాదాపూర్, సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట, తార్నాక, తిరుమలగిరి, మల్కాజ్‌గిరి, ఈసీఐఎల్, నిజంపేట,మాధపూర్, పంజాగుట్ట, బంజారాహిల్స్ పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు పొంగి పొర్లుతుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిసెంట్‌గా తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే.