చైనాలో ఒక్కో కోతి ధర రూ.25 లక్షలు
posted on Jan 10, 2026 6:09PM

చైనాలో కోతుల కొరత పెరిగిపోతండంతో వాటికి భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్కో కోతికి ఏకంగా రూ.25 లక్షల వరకు చెల్లిస్తున్నారు. కొత్తగా తయారు చేసిన మందుల క్లినికల్ ట్రయల్స్ కోసం చైనా కోతులపై ఆధారపడుతోంది. కోతుల కొరత కారణంగా.. ఔషధాలు తయారు చేసే వ్యయం పెరగడంతోపాటు.. కొత్త పరిశోధనలు ఆలస్యం అవుతున్నాయని చైనా ఆందోళన చెందుతోంది.
చైనాలో బయోటెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తుండటంతో.. ల్యాబ్‌లలో ప్రయోగాల కోసం ఉపయోగించే కోతుల కొరత ఏర్పడింది. దీంతో కోతుల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఒక్కో కోతి ధర 1.5 లక్షల యువాన్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది. కొత్త మందుల క్లినికల్ ట్రయల్స్ విపరీతంగా పెరగడం, కోతుల పెంపకంలో నెలకొన్న జాప్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.
దీని వల్ల మందుల తయారీ ఖర్చు పెరుగుతోందని.. కొత్త ప్రయోగాలు చేయడానికి మరింత గతేడాది ఒక్కో కోతి సగటు ధర సుమారు 1,03,000 యువాన్లు అంటే దాదాపు రూ.13 లక్షలు ఉండగా.. 2026 ప్రారంభం నాటికి రూ.25 లక్షల వరకు చేరుకుంది. కరోనా మహమ్మారి సమయంలో గరిష్ట స్థాయికి చేరిన కోతుల ధరలు.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి చేరుకోవడం పరిశోధనా సంస్థలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.