హెలికాప్టర్ నదిలో కూలి ఆరుగురు దుర్మరణం.. మృతుల్లో ఐటీ కంపెనీ సీఈవో కుటుంబం

అమెరికాలో  హెలికాప్టర్ నదిలో కూలిన సంఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో జర్మనీకి చెందిన ఐటీ కంపెనీ హెడ్ కుటుంబం మొత్తం మరణించింది.  జర్మనీకి చెందిన టక్నాలజీసంస్థ స్పెయిన్ విభాగం హెడ్, సీఈవో అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనలో ఉన్నారు.

ఈ సందర్భంగా వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హడ్సన్ నదిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ లో ఉన్న ఆరుగురూ అంటే.. ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురుపిల్లలు, పైలట్ మరణించారు.  ఈ ప్రమాద ఘటనపై  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu