నెల్లూరును చెరువులా మార్చేసిన భారీ వర్షాలు
posted on Oct 16, 2024 10:43AM
ఆంధ్రప్రదేశ్ ను వర్షాలు వెంటాడుతున్నాయా అని పిస్తున్నది. భారీ వర్షాలు వదరలతో బెజవాడ వాసులు పడిన ఇబ్బందుల నుంచి ఇంకా పూర్తాగా తేరుకోనైనా లేదు.. అప్పుడే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా నెల్లూరు, దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ వర్షాల ముప్పు ఉంది. వాతావరణ శాఖ ప్రకటేన మేరరు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ గురువారం (అక్టోబర్ 17) నాటికి తుపానుగా మారి పుదుచ్చేరి- నెల్లూరుల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
ఈ వాయుగుండం ప్రభావం అప్పుడు నెల్లూరు జిల్లాపై తీవ్రంగా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా జలదంకిలో అత్యధికంగా 23.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే విడవలూరు 20.6, అల్లూరులో 19.7, కందుకూరు, కావలి, బోగోలులో 18, కొడవలూరులో 18, దగదర్తి, కోవూరు, నెల్లూరు రూరల్‌లో 17 సెంటీమీటర్ల వర్షపాతం, నెల్లూరు రూరల్, ఇందుకూరుపేట, వెంకటాచలంలో 16, బుచ్చి, సంగం, ముత్తుకూరులో 15సెంటీమీటర్ల వర్షపాతంనమోదైంది.
అలాగే చెన్నై కూడా భారీ వర్షాలకు చిగురుటాకులా వణుకుతోంది. వేలచేరిలో వేలాది ఇళ్లు నీటమునిగాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలో 11 సబ్ వేలు మూసివేశారు. సాయంత్రం వరకు మెట్రో రైలు రద్దు చేశారు. సహాయ చర్యల కోసం 16 వేల మంది వాలంటీర్లు పని చేస్తున్నారు. వరద బాధితుల కోసం 980 పునరావస కేంద్రాలు ఏర్పాటుచేశారు.
Tq.చంద్రబాబుకు ఎలాంటి ఎలాంటి సంబంధం లేదని తేలింది.