ఉత్తరాంధ్రాలో భారీ వర్షాలు
posted on Sep 9, 2024 10:00AM
వాయుగుండం కారణంగా ఎపిలో భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో బంగాళఖాతంలో మరో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కంటిన్యూగా ఇక్కడ వర్షం కురవడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. విజయనగరం చీపురు పల్లిలో 10.35సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ పట్నం జిల్లా గోపాల పట్నంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీవతో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. స్థానికులు ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో బెజ్జిపురం, బుడతవలస, సెట్టిగడ్డ రూట్ లో వరదతాకిడికి గురై ఓ వ్యాన్ కొట్టుకుపోయింది. స్థానికులు జోక్యం చేసుకుని డ్రైవర్ ను రక్షించగలిగారు.