తెలంగాణ రాష్ట్రానికి వడగండ్ల వర్ష సూచన
posted on Apr 26, 2020 7:16PM
విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడ మరియు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్న కారణంగా, తెలంగాణాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.