తిరుమలలో భారీ వర్షం

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం కొనసాగుతోంది. రేపు పుదుచ్చేరి, నెల్లూరు జిల్లాల్లో  తిరుమలలో ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. జెసిబిల ద్వారా బండరాళ్లను తొలగిస్తున్నారు.  రెండో ఘాట్ రోడ్డుపై టిటిడి ప్రత్యేక నిఘా  ఏర్పాటు చేసింది.  ముందస్తు చర్యలో భాగంగా పాపవినాశనం, శ్రీవారి పాదాల మార్గం  మూసివేసారు. తిరుమల నుంచి వచ్చే వరద నీరు తిరుపతికి చేరే అవకాశం ఉండటంతో ముంపు బాధితులను ఆదుకోవడానికి  అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తిరుమలతో బాటు చిత్తూరు అంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు సహా పలు జిల్లాల్లో పరిస్థితిపై  అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.