ప‌న‌స పండు త‌ర‌చూ తింటే..!

కోరోనా తరువాత శరీరం లో రోగనిరోదక శక్తి తగ్గింది కాబట్టి.మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. గరీబోడికి బాదం, పిస్తా, కర్జూరం కొనాలంటే కాస్త ఇబ్బందే అందుకే అతి తక్కువ ఖర్చుతో కూడిన గరీబోడి బాదాం ఏది అని కదా మీ ప్రశ్న అదే పనస పండు. పనస పండు పై భాగం లో ముళ్ళు ముళ్ళు గా ఉన్నప్పటికీ లోపల ఉండే పనస తొనల సువాసన తొనలను తిన్నకొద్దీ తినాలని అనిపిస్తుంది.పనసపండు చూసేందుకు అందం గానూ ఉండే తోన అందులో ఉండే గింజలో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయంటే ఎవరూ నమ్మరు. పనస పండులో విటమిన్ బి,లేదా రక్తహీనత ఉన్నవాళ్ళకి పనసపండు శ్రేష్టం.మీ చర్మం అందంగాను జుట్టు ద్రుడంగాను ఉండాలంటే పనసపండు కు మించినది లేదని న్యుట్రీషియనిస్ట్ లు అంటున్నారు.

న్యుట్రీషియనిస్ట్ లు చేసిన పరిశోధనలలో పనస గింజలలో అద్భుతమైన గుణాలు ఉన్నా యని పేర్కొన్నారు. పనస గింజల ను తినే పద్ధతి ని  పనస గింజలలో  ఉండే లాభాల ను గురించి వివరించారు. వేసవి కాలం లో మాత్రమే లభించే పనసపండు పనసతోన కేవలం సువాసన నే కాదు ఆరోగ్య పరంగా మరిన్ని పోషకాలు లభ్యమౌతాయి.ప్రత్యేకంగా పనసగింజలు ఆరోగ్య ఖజానాను అందిస్తుందని పేర్కొన్నారు. పనస తొనలు,గింజలు తీసుకోవడం వల్ల మంచిఫలితాలు ఇస్తాయని గింజలను సరైన పద్దతిలో తినడం వల్ల  ఆరోగ్య ఫలితాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.

పనస గింజలు అద్భుత ఫలితాలు...

పనస గింజలలో కొన్ని రకాల పోషక తత్వాలు సంపూర్ణంగా లభిస్తాయి. పనస గింజలలో విటమిన్ బి గుణాలు సంపూర్ణం గా లభిస్తాయి. విటమిన్ సి,విటమిన్ఏ  తయామిన్, రేబాఫ్లోబిన్, జింక్,నియాసిన్, లాంటి చాలా రకాల తత్వాలు ఇందులో ఉంటాయి. పనస గింజలు తినడం వల్ల శరీరం లో హిమాగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మీరు ప్రోటీన్ కోసం వెతుకు తున్నారా ప్రత్యామ్నాయం గా పనస గింజలు ఎంచుకోవచ్చు. పనస గింజలు శరీరం లోపల నుండి బలోపేతం చేస్తుంది.అనారోగ్య తీవ్రతను నియంత్రిస్తుంది.

పనస గింజలను ఎలా ఉడికించాలి...

పనస గింజలు తినే ముందు శుభ్రంగా కడిగి శుభ్రంగా ఒలిచి గింజలు ఒకదగ్గర చేర్చి శుభ్రంగా నిపౌలమీద కాల్చినా, లేదా పెనం పై రోస్ట్ చేసి తిన్న ఆరుచి వేరు అంటారు పనస ప్రియులు. బాగా మరిగించిన నీటిలో వేసిన గింజలు వేసి కొంచం ఉప్పు జోడించండి చాలా రుచిగా ఉంటుందని అంటారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు పనస పొట్టు తో కూర అద్భుతంగా చేస్తారు పనస కూర తో చేసే బిరియాని చాలా రుచిగా ఉంటుంది. సో ఏని  వే గరీబోడి బాదం పనస గింజల తో అద్భుత ఫలితాలు  ఉన్నాయన్నది వాస్తవం.