గ్రీన్ టీ బరువు తగ్గడానికే కాదు..ఈ సమస్యలకు చెక్ పెడుతుంది!
posted on Nov 10, 2023 3:45PM
బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీ తాగుతుంటారు. అయితే గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ బి5, పాలీఫినాల్, మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, ఆక్సిడెంట్లు వంటి పోషకాలు గ్రీన్ టీలో లభిస్తాయి. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే, ఒక రోజులో గ్రీన్ టీ ఎంత తాగాలి అనే ప్రశ్న కూడా ప్రజల మదిలో మెదులుతోంది. కాబట్టి రోజుకు ఎంత గ్రీన్ టీ తాగాలో ఇప్పుడు చూద్దాం.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి:
మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే.. మీరు వెంటనే అనారోగ్యానికి గురైనట్లయితే, ఖచ్చితంగా గ్రీన్ టీని తాగండి. గ్రీన్ టీ మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దీనివల్ల మీరు సులభంగా ఏ వ్యాధి బారిన పడరు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి.
బరువు కోల్పోతారు:
గ్రీన్ టీలో పాలీఫెనాల్ ఉంటుంది, ఇది శరీర జీవక్రియను బలపరుస్తుంది. ఇందులో కొవ్వు, పిండి పదార్థాలు ఉండవు. ఇప్పటికే ఏర్పడిన కొవ్వును తగ్గించడానికి గ్రీన్ టీ పని చేయదు కానీ కొవ్వు ఏర్పడకుండా నిరోధించడానికి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది.
ఒత్తిడిని దూరం చేస్తాయి:
గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. మీరు చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, మీరు ఈ టీని తీసుకోవాలి. రోజూ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
బీపీకి, గుండెకు మేలు చేస్తుంది:
గ్రీన్ టీ చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంతోపాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా మీ బీపీని తగ్గించుకోవచ్చు. అలాగే హార్ట్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది.
రోజుకు ఎన్నిసార్లు తాగాలి :
మీకు ఎలాంటి వ్యాధి లేకుంటే, మీరు రోజుకు 2 నుండి 3 కప్పుల గ్రీన్ టీని తీసుకోవచ్చు. కానీ మీరు డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, మీరు గ్రీన్ టీని తీసుకునే ముందు ఒకసారి మీ వైద్యుడిని సంప్రదించాలి.