నల్ల ఉప్పు నీటిని ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
posted on Jun 11, 2024 9:30AM
ఉప్పు వంటకు రుచిని ఇస్తుంది. ఉప్పు లేని వంట ఎవరూ తినలేరు కూడా. ఉప్పులో చాలా రకాలున్నాయి. వాటిలో రాతి ఉప్పు, సాధారణ ఉప్పు మాత్రమే కాకుండా కొన్ని రకాల స్నాక్స్ లోనూ, వంటలలోనూ ప్రత్యేకంగా నల్ల ఉప్పును వాడుతుంటారు. బ్లాక్ సాల్ట్ అని పిలుచుకునే ఈ నల్ల ఉప్పును నీటిలో కలిపి ప్రతి రోజూ ఉదయమే ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలుంటాయని అంటున్నారు. నల్ల ఉప్పును, నల్ల ఉప్పు నీటిని ఆరోగ్య ప్రయోజనాల కోసం.. ఆయుర్వేదంలో చాలా ఏళ్ల నుండి ఉపయోగిస్తున్నారు. నల్ల ఉప్పులో సోడియం క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. నల్ల ఉప్పు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందంటే..
నల్ల ఉప్పు నీరు కాలేయాన్ని శుధి చేయడంలో సహాయపడుతుంది. ఈ ఉప్పు ప్రత్యేకత ఏమిటంటే ఇది కాలేయ కణాలలో పేరుకుపోయిన మురికిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాకుండా కాలేయం పనితీరును వేగవంతం చేస్తుంది. కాలేయానికి పొంచి ఉండే ఇతర వ్యాధులను నివారిస్తుంది.
కేవలం కాలేయాన్ని మాత్రమే కాదు.. నల్ల ఉప్పు నీరు తాగితే శరీరం కుడా శుద్ది అవుతుంది. శరీరంలో ఉండే టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.
చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో నల్ల ఉప్పు నీరు చాలా సహాయపడుతుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నల్ల ఉప్పు నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. మలబద్దకాన్ని తగ్గించడం ద్వారా ఫైల్స్ సమస్య కూడా తగ్గుతుంది.
ఒకే రకమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ఎసిడిటీ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే నల్ల ఉప్పు నీటిలో ఆల్కలీన్ స్వభావం ఉంటుంది. ఇది ఎసిడిటీని తగ్గించడంలో.. కడుపులో ఆమ్లాలను తటస్థం చేయడంలో సహాయపడుతుంది. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ నుండి ఉపశమం కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు, కాసింత నిమ్మరసం కలిపి తీసుకుంటే ఎసిడిటీ సమస్య మరింత తొందరగా తగ్గుతుంది. జీవక్రియ కూడా బాగుంటుంది.
*రూపశ్రీ.