హాట్సాఫ్ డాక్టర్!
posted on Sep 12, 2022 10:59PM
ఎదురు వస్తున్న పిల్లల్ని పక్కకి నెడుతూ ఓ టెన్త్ క్లాస్ పిల్ల ఖంగా రుగా మళ్లీ స్కూ ల్లోకి పరిగెట్టింది. పిల్లలు చూసి వెక్కిరిస్తూ ఆనం దించారు. ఆమె పుస్తకం ఒకటి క్లాస్‌లో మర్చి పోయింది. ఓ కుర్రాడు బస్సు వెంట పరిగెడు తుంటే రోడ్డుమీద వెళ్లేవారు తిట్టారు పడిఛస్తావని. అతనికి నవ్వొచ్చింది..లవ్లెటర్ ఇంకా చేతిలోనే ఉంది, లవర్ ముందెళ్లే బస్సులో ఉందని! బెంగుళూ రులో ఆ మధ్య ఓ మద్య వయసాయన ట్రాఫిక్ లో వాహనాలు నిలవగానే అమాంతం కారు దిగి పరిగెట్టుకుంటూ వెళుతూంటే అంతా ఆశ్చర్యంతో చూస్తుండి పోయారు. కారు వదిలి వెళ్లేంత తొందరపనేమిటా అని. తీరా చూస్తే ఆయన ఓ డాక్టర్! ఒక రోగి ప్రాణాలు కాపా డేందుకు ఆ డాక్టర్ ఏకంగా మూడుకిలోమీటర్లు పరిగెట్టాడు. ఒలింపిక్స్ వెళ్లాల్సినాయన ఆస్పత్రికి పరిగెట్టాడను కున్నారు కుర్ర కారు!
బెంగుళూరు సర్జాపూర్‌లోని మణిపాల్ ఆస్పత్రిలో గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ గోవింద్ నందగోపాల్. ఆయన మొన్నామధ్య ఆస్పత్రిలో ఒక రోగికి ఆపరేషన్ చేయాలని బయలుదేరారు. మరి మూడు కిలోమీటర్ల దూరంలోఆస్ప్రతి ఉందనగా ఆయన కారు ట్రాఫిక్‌లో చిక్కడింది. ట్రాఫిక్ పరిస్థితి చూస్తే అందులోంచి ఆయన అంత త్వరగా బయటపడే అవకాశం లేదని డాక్టర్ గ్రహించారు. అందుకే వెంటనే కారులోంచి బయటికి వచ్చి ఆస్పత్రికి పరిగెట్టడం మొదలెట్టారు. ఆయన్ను చూసి ఏదో అయింద నుకున్నారంతా. కానీ ఆయన వృత్తి ధర్మం ఆయన్ను పరిగెట్టించింది. కారుని డ్రైవర్‌కి అప్పగించి బయలుదేరారు. మరి కొద్ది సేపట్లో ఆపరేషన్ చేయకుంటే అక్కడి పేషంట్‌కి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. అందుకే సమయం వృద్ధాచేయకుండా మూడు కిలోమీటర్లు పరిగెత్తి ఆస్పత్రి చేరుకున్నారు. డాక్టర్ వస్తున్నారని తెలిసి అస్పత్రి సిబ్బంది మరో డాక్టర్ ఆ పేషంట్‌కి ఆపరేషన్ థియేటర్ ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. డాక్టర్ గోవింద్ ట్రాఫిక్, జనాలను పట్టించుకోకుండా వీలయినంత వేగంగా పరి గెట్టి ఆస్పత్రికి సమయానికి చేరుకున్నారు. అంతేకాదు ఆపరేషన్ విజయవంతంగా ముగించారు.
ఆమధ్య బెంగుళూరులో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ నీటి మయం అయ్యాయి. విపరీత ట్రాఫిక్ జామ్తో ప్రజలు నానా అవస్థ పడ్డారు. సరిగ్గా ఆ సమయంలోనే ఇది జరిగింది. ఆ డాక్టర్ పరిగెడుతూ వెళ్లడాన్ని వీడియో తీసేరు కొందరు. చాలామంది ఆయన్ను ఎంతో మెచ్చుకున్నారు. అసలు అంత వేగంగా ఎలా వెళ్లగలిగారు అని అడిగారు. అందుకు డాక్టర్ సమాధానం చెబుతూ తనకు జాగింగ్ బాగా అలవాటు ఉండంతో మూడు కిలోమీటర్ల దూరం సునాయాసంగా పరిగెత్తగలిగానన్నారు. ఆయన ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం, పరిగెట్టి వెళ్లడంకంటే ఆయన అవతల పేషెంట్ గురించి ఎంతో ఆలోచించడమే గొప్ప విషయం. హాట్సాఫ్ డాక్టర్!