'నల్ల కుభేరుడు' హసన్ పై కేసు

హైదరాబాద్ : ‘నల్ల కుభేరుడు’ హసన్ అలీపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సాలార్‌జంగ్ మ్యూజియంలోని నిజాం కాలం నాటి పురాతన వస్తువుల మాయం వెనక హస్తం హసన్ అలీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. హసన్ అలీ హైదరాబాదులోని సాలార్‌జంగ్ మ్యూజియం నుండి పలు విలువైన వస్తువులను దొంగిలించి దేశం దాటించినట్లుగా ముంబయి ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వారు హైదరాబాదులోని సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలీ మ్యూజియం నుండి 1995 నుండి 2000 సంవత్సరాల మధ్య కాలంలో పలు వస్తువులు దొంగిలించారని సిసిఎస్‌కు చెప్పారు. దీంతో సిసిఎస్ పోలీసులు హసన్ ఆలీపై దొంగతనం కేసు పెట్టారు. అయితే ఈ దొంగతనం హసన్ అలీ ఒక్కడే చేయలేడు. కాబట్టి అప్పటి అధికారులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మ్యూజియం నుండి ఎన్ని వస్తువులు పోయాయనే విషయంలో స్పష్టత లేనట్టుగా తెలుస్తోంది.