సగం మంది సినీ సెలబ్రిటీలు అమ్ముడు పోయారు.. ప్రకాశ్ రాజ్

ప్రకాశ్ రాజు ఇటీవలి కాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. అదే కోవలో తాజాగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సగం మంది సెలబ్రిటీలు అమ్ముడు పోయారనీ, మిగిలిన సగం మంది భయంతో మౌనాన్ని ఆశ్రయించారనీ అంటూ విమర్శలు గుప్పించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సినీ పరిశ్రమకు చెందిన ఎవరూ కూడా దేశ రాజకీయాల పట్ల స్పందించడం లేదని విమర్శించారు.   ప్రభుత్వానికి అమ్ముుడు పోయారంటూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరం చేసిన వాళ్లనైనా చరిత్ర క్షమిస్తుంది కానీ, నిజాలు మాట్లాడకుండా మౌనం దాల్చిన వారిని మాత్రం క్షమించదన్నారు.  

ప్రభుత్వం ఏదైనా సరే అణచివేతకు పాల్పడితే గళమెత్తాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుందన్నారు. మరీ ముఖ్యంగా కళారంగానికి చెందిన వారిపై ఎక్కువగా ఉంటుందన్నారు. అయినా ఆ బాధ్యతను విస్మరించి సినీ పరిశ్రమకు చెందిన వారెవరూ నోరెత్తడం లేదంటే అందుకు కారణం సగం మంది ప్రభుత్వానికి అమ్ముడు పోవడం, మిగతా సగం మందికీ మాట్లాడే ధైర్యం లేకపోవడం అని ప్రకాష్ రాజ్ అన్నారు.  ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా సినిమా పరిశ్రమకు చెందిన వారు గొంతెత్తాలని ప్రకాశ్ రాజ్ అన్నారు. లేకుంటే చరిత్ర వారిని క్షమించదన్నారు. ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తాయనీ, కానీ అణచివేతను ధిక్కరించి గొంతు వినిపించాల్సిన బాధ్యతను విస్మరించకూడదన్నారు.  

పహల్గాం ఉగ్రదాడి నెపంతో పాకిస్థానీ నటుడు పవద్ ఖాన్ నటించిన అబిర్ గులాల్ సినీమాను కేంద్రం నిషేధించడాన్ని ప్రకాష్ రాజ్ ఖండించారు. అసలు ఏ సినిమానైనా సరే నిషేధించడం తగదన్నారు.  ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  ప్రకాశ్ రాజ్ కు అనుకూలంగా, వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu