కర్ఫ్యూ రోజైనా అధికారపార్టీ నేతల, దావత్‌పై కరోనా పంజా!
posted on Mar 28, 2020 4:39PM
గుంటూరు గోడౌన్ దావత్‌లో పోలీసులు, నేతలు కూడా పాల్గొన్నారా? ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూ ప్రకటించిన రోజు. ఊరంతా ఇళ్లల్లో బిక్కుబిక్కు మంటోంది. కానీ శాసనసభ్యులు ముస్తఫా బావ ఊరు బయట తమకు చెందిన ఓ గోడౌన్‌లో దావత్ పెట్టుకున్నారు. అయితే ఈ దావత్‌కు కుటుంబసభ్యులే కాదు కొంత మంది పోలీసులు, రాజకీయనాయకులు కూడా పాల్గొన్నారంట. జనతా కర్ఫ్యూ రోజు అసలు అనుమతి ఎలా లభించిందని ప్రశ్నిస్తే....
ఇదేమైనా రాజకీయ పార్టీ మీటింగ్‌నా, ఇంట్లో పెట్టుకున్న చిన్న గెట్ టు గెదర్ అంటూ ఆ దావత్‌కు కొంత మంది పోలీసులు కూడా వెళ్లి మటన్ బిర్యానీ తిన్నారట. అంతే కాదు ఈ దావత్‌లో ముస్తఫాతో పాటు పార్టీకి చెందిన మరో ముగ్గురు శాసనసభ్యులు కూడా పాల్గొన్నారనే పుకార్లు గుంటూరు నగరంలో షికార్లు చేస్తున్నాయి. అసలు ఈ దావత్‌లో ఎంత మంది పాల్గొన్నారనే విషయంపై కూడా స్పష్టత లేదు. కొంత మంది 200 మంది అంటే మరి కొంత మంది 500 మంది పాల్గొన్నారని చెబుతున్నారు.
ఎమ్మెల్యే ముస్తఫా బావ షేక్ సుభాని. ఎమ్మెల్యేతో పాటే ఆయన అన్ని వ్యాపారాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వుంటాడు. ఆధ్యాత్మికత కూడా అతనికి కొంచెం ఎక్కువే. అందులో భాగంగా ఢిల్లీ నిజాముద్దీన్ ఔలియా మర్కస్ ఇస్తమా కోసం వెళ్ళాడట. మూడు రోజులు అక్కడే వుండి ట్రైన్‌లో గుంటూరుకు వచ్చాడు.
ప్రపంచంలో వున్న ముస్లిం మతపెద్దలకు ఢిల్లీ నిజాముద్దీన్ ఔలియా మర్కస్ హెడ్ క్వార్టర్స్. ఏడాది పొడుగునా ఇక్కడ నుంచి నిరంతరం మత కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్కడి నుంచే గ్రూప్‌ల వారీగా మతబోధకులు బయలుదేరి వివిధ ప్రాంతాల్లో వున్న ముస్లింలను కలిసి వారికి ఇస్లాం జ్ఞానాన్ని బోధిస్తుంటారు. ఢిల్లీ వెళ్లి, ఢిల్లీ మర్కస్ బోధనలు తెలుసుకోవడానికి తబ్లిక్ జమాత్‌కు చెందిన ముస్లింలు ఉత్సాహం చూపుతారు. అందులో భాగంగానే షేక్ సుభాని (ఎమ్మెల్యే ముస్తఫా బావ) మూడు రోజుల ఇస్తమాకు ఢిల్లీ వెళ్లి వచ్చారు. గుంటూరు నగరం బయట తమకు సంబంధించిన ప్రైవేట్ గోడౌన్‌లో ఇస్తమా దావత్ ఇచ్చారు. ఈ దావత్‌లో కుటుంబసభ్యులతో పాటు కొంత మంది ప్రముఖులు కూడా పాల్గొన్నారని ప్రచారం జరుగుతోంది.