గూగుల్ మొదటి అడుగుకు 27వసంతాలు పూర్తీ!

గూగుల్ మనిషి రోజువారీ ఎక్కువగా ఉపయోగించే సెర్చ్ ఇంజిన్. హిస్టరీ గురించి వెతకాలా?  గూగుల్ లో సెర్చ్ చేస్తే వికీపీడియా వొస్తుంది. సినిమా సమాచారం కావాలా? గూగుల్ లో సెర్చ్ చేస్తే బోలెడు అప్డేట్స్ ఉంటాయి. అనారోగ్యానికి ఏవైనా చిట్కాలు కావాలా? గూగుల్ తల్లి మంచి మందులేవో చక్కగా చూపిస్తుంది. వ్యాపారం, ఉద్యోగం, సినిమా, జోకులు, ప్రత్యేక దినాలు, చరిత్ర, చరిత్రలో ముఖ్యమైన సంఘటనలు, గొప్ప వ్యక్తులు.. ఆఖరికి ప్రియురాలికి ఎలా ప్రపోజ్ చేయాలి?  వంటి ప్రశ్నల నుండి.. ఎలా చచ్చిపోవాలి అనే పిచ్చి సమాధానాల వరకు అన్ని గూగులమ్మ చెబుతుంది. అయితే ఈ రోజు ప్రజలు ఇంతగా గూగులమ్మ మీద ఆధారపడటం అనేది ఒక ఏడాది, ఒక ప్రయత్నంతో జరిగింది కాదు. గూగులమ్మ ఇప్పుడు 27ఏళ్లు పూర్తీ చేసుకుంది. అసలు గూగుల్ ప్రయాణం ఏంటి? ఇది ఎలా మొదలైంది? వివరంగా తెలుసుకుంటే..

Google.com దినోత్సవం సెప్టెంబర్ 15న జరుపుకుంటారు.  గూగుల్ డాట్ కామ్ ను   ప్రారంభించిన మాతృ సంస్థ గురించి తెలుసుకుంటే గూగుల్ ప్రయాణం బాగా అర్థమవుతుంది.  గూగుల్ ప్రజల జీవితంలో పెద్ద భాగం. మొదట్లో ఇది  కేవలం సెర్చ్ ఇంజిన్‌గా మాత్రమే ప్రారంభమైంది, కానీ ఇప్పుడు అనేక ఇతర సేవలను అందించే బహుళజాతి సాంకేతిక సంస్థగా రూపాంతరం చెందింది. 'గూగుల్' అనే పదం ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యత పొందింది. గూగుల్ డాట్ కామ్ జనవరి 1996లో ప్రారంభమైంది. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని Ph.D విద్యార్థులైన  లారీ పేజ్,  సెర్గీ బ్రిన్ మెరుగైన సెర్చ్  ఇంజిన్‌ను రూపొందించడానికి పరిశోధన ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. వారు వెబ్‌సైట్‌ల మధ్య సంబంధాలను విశ్లేషించే పేజ్‌ర్యాంక్ అనే అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు. ఇది ఇతర సైట్‌లకు లింక్‌ల సంఖ్య ఆధారంగా వాటి ఔచిత్యాన్ని నిర్ణయించింది.

సెర్చ్  ఇంజిన్ మొదట డవలప్  చేయబడినప్పుడు దాని పేరు  “బ్యాక్‌రబ్”. ఈ పేరు ఆ తరువాత  Google గా మార్చబడింది, నిజానికి గూగుల్ అనేది  'గూగోల్' అనే పదాన్ని అక్షరదోషంలో పలకడం ద్వారా ఆవిష్కారమైంది.   గూగోల్ అనేది అతిపెద్ద సంఖ్య. ఒకటి తరువాత   100 సున్నాలను రాస్తే అది గూగోల్ అవుతుంది. ఇక Google చాలా సమాచారాన్ని అందిస్తుంది, ప్రస్తుతం   ఇంటర్నెట్‌లోని సమాచారం అంతులేనిదని.

సెప్టెంబర్ 15, 1997న, పేజ్,  బ్రిన్ “ google.com ” డొమైన్‌ను నమోదు చేసుకున్నారు . 1998లో, పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించిన తర్వాత పేజ్,  బ్రిన్ కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్‌లోని స్నేహితుని గ్యారేజీకి అనుబంధంగా ఉన్న గదిలో అధికారికంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. డిసెంబరు 1999 నాటికి Google బీటా మోడ్‌లో ఉంది.  రోజుకు దాదాపు 10,000 సెర్చింగ్  ప్రశ్నలకు సమాధానాలు లభించేవి.  2003లో, గూగుల్ తన ప్రధాన కార్యాలయాన్ని ఇప్పుడు గూగుల్‌ప్లెక్స్ అని పిలవబడే చోటుకు మార్చబడింది. వాస్తవానికి ఇది కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో 40 ఎకరాల క్యాంపస్. కాలక్రమేణా వారు సైట్‌లో అనేక భవనాలను కొనుగోలు చేశారు,  వాటికి అనధికారిక పేర్లను ఇచ్చారు. క్యాంపస్‌లో క్యూబికల్స్ లేకుండా ఓపెన్ కాన్సెప్ట్ ఉంది,  ఇక్కడ  బంతులను కుర్చీలుగా ఉపయోగించారు.

మెరియం-వెబ్‌స్టర్ 2006లో దాని కాలేజియేట్ డిక్షనరీకి 'గూగుల్' అనే పదాన్ని జోడించారు.  "ఇంటర్నెట్‌లో సమాచారాన్ని పొందడానికి Google సెర్చ్  ఇంజిన్‌ను ఉపయోగించడం." అని ఈ డిక్షనరీలో ప్రస్థావించారు.  కంపెనీ సెర్చ్ ఇంజిన్‌గా ప్రారంభమైంది, కానీ ఇప్పుడు అనేక ఇతర సేవలను అందిస్తుంది. 2015లో కంపెనీ పునర్నిర్మించబడింది.  ఆల్ఫాబెట్ ఇంక్.గా మారింది.  గూగుల్ దాని అతిపెద్ద అనుబంధ సంస్థగా మారింది. ఇదీ గూగుల్ తల్లి చరిత్ర.

                                                     *నిశ్శబ్ద.

Related Segment News