ఒక్క రోజులోనే రూ.1000 పెరిగిన బంగారం

గత కొద్ది రోజులుగా స్లో అండ్ స్టడీగా ఉన్న బంగారం ధరలు ఇవాళ ఆకాశాన్ని తాకాయి. ఏకంగా ఒక్కరోజులోనే రూ.990 పెరిగి విశ్లేషకులను నివ్వేరపరిచింది. గడచిన ఎనిమిది నెలల్లో పసిడి ధర ఇంత భారీగా పెరగడం ఈరోజే. దీంతో పదిగ్రాముల బంగారం ధర రూ.31,350కి చేరింది. ఉత్తరకొరియా, అమెరికాలు కయ్యానికి కాలు దువ్వుతుండటం, వరుస అణుపరీక్షలు, అమెరికాను వణికిస్తున్న హరికేన్ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావడంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు వెండి కూడా పసిడి బాటలోనే పయనిస్తూ కిలో వెండి రూ.42 వేలకి చేరింది.