గ్రేటర్ ఎన్నికలు.. నామినేషన్ల స్వీకరణ షురూ..
posted on Jan 12, 2016 12:21PM
.jpg)
గ్రేటర్ ఎన్నికల సమరానికి నగరా మోగనుంది. ఈ ఎన్నికలకు గాను నామినేషన్ల స్వీకరణ ఈ రోజు ఉదయం 11 గంటల నుండి ప్రారంభమైంది. మొత్తం గ్రేటర్లో 150 వార్డులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇదిలా ఉండగా ఈ రోజు నుండి 17వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ ఉండగా.. సంక్రాంతి పండుగ సందర్భంగా 14, 15 తేదీల్లో మాత్రం నామినేషన్లు స్వీకరించరు. దీంతో నామినేషన్లకు నాలుగు రోజుల మాత్రమే గడువు ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు.
కాగా ఈరోజు నుండి నామినేషన్లు స్వీకరణ ప్రారంభించగా.. 18వ తేదీ సోమవారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. అభ్యర్థుల తుది జాబితాలను అదే రోజు సాయంత్రం ప్రకటిస్తారు. అభ్యర్థులు నామినేషన్ డిపాజిట్‌గా రూ. 5 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు నామినేషన్ డిపాజిట్ చెల్లింపులో రాయితీ ఇచ్చారు. వీరు రూ. 2,500 చెల్లిస్తే సరిపోతుంది.