కూలిన విమానం... 148 మంది మృతి

 

ఫ్రాన్స్‌లోని దక్షిణ ప్రాంతంలో జర్మనీ వింగ్స్‌ విమానయాన సంస్థకి చెందిన 4 యు 9525 విమానం కూలిపోయింది. ఈ విమానంలో 142 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది వున్నారు. వీరందరూ మరణించినట్టు భావిస్తున్నారు. ఈ విమానం స్పెయిన్‌లోని బార్సిలోనా నుంచి జర్మనీలోని దస్సెల్‌డర్ఫ్‌కి ప్రయాణిస్తోంది. ఈ విమానం ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్ పర్వత ప్రాంతంలో వుండగా రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.