గాంధీ గుట్టు ఒక్కొక్కటిగా వెలుగులోకి..

తెలంగాణలోని గాంధీ ఆసుపత్రి లోగుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తాజాగా డాక్టర్ వసంత్ గాంధీలో జరిగే అక్రమాలను బయటపెట్టాడు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ తో అనేక అవినీతి, అక్రమాల బయటకు పొక్కుతున్నాయి. ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటూ కొట్టిపారేస్తున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్. గాంధీ ఆసుపత్రిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని శ్రవణ్ అంటున్నారు. 

కరోనాపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలతో సస్పెండైన గాంధీ ఆస్పత్రి వైద్యుడు వసంత కుమార్ వ్యవహారం ఎవరూ ఊహించని మలుపులు తిరుగుతోంది. డాక్టర్ వసంత్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. రెండేళ్లుగా గాంధీలో బయో మెట్రిక్ సిస్టం పని చేయడం లేదని మరో సంచలనాంశం వెలుగులోకి వచ్చింది. విధుల్లోకి వస్తున్న వైద్యులు ఎవరో కూడా తెలియని పరిస్థితి గాంధీలో నెలకొన్నదని వసంత్ చెప్తున్నదాన్ని బట్టి చాలా మంది వైద్యులు అసలు విధులకు రావడం లేదని కూడా సమాచారం అందుతుంది. అలాగే.. డ్యూటీలకు రాకపోయినా సరే.. శాలరీలు మాత్రం మొత్తంగా దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసంత్ చుట్టూ అవినీతి ఆరోపణలు కమ్ము కుంటున్నాయని మెడికల్ సిబ్బందిని దుర్భాషలాడిన ఫోన్ రికార్డింగ్ లు కూడా వెలుగులోకి వచ్చాయి.

అదేవిధంగా గాంధీ ఘటన నేపథ్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వసంత్ చేసిన ఆరోపణలపైనా కమిటీ విచారణ జరుపుతోంది. అయితే గాంధీ సూపరింటెండ్ శ్రవణ్ మాత్రం వసంత్ ని ఓ అక్రమాల కోరుగా తెలిపపడమే కాకుండా మెడికల్ షాపులో కూర్చొని తప్పుడు బర్త్ సర్టిఫికెట్ల జారీ చేస్తున్న దృశ్యాలను విడుదల చేశారు. కాగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన డాక్టర్ వసంత్ గాంధీ హాస్పిటల్ పై, అందులో ఉన్న నిష్ణాతులైన వైద్యులపై అనేక ఆరోపణలు చేశారు. అలాగే.. వారు ఒక్కరోజు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోడమే కాక వారి వేతనాలు తగ్గించి తీవ్రంగా దండించే వారని కూడా డాక్టర్ వసంత్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో హౌస్ సర్జన్ సర్టిఫికెట్ల జారీలో భారీ కుంభకోణం జరిగిందని, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ పాత్ర ఇందులో ఉందని ఆయన ఆరోపించారు.