గాంధీతో పనిచేసిన స్వాతంత్య్ర సమరయోధుడు కన్నుమూత
posted on Jun 10, 2016 6:10PM

జాతిపిత మహాత్మాగాంధీతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పనిచేసిన సమరయోధుడు సుభాంశు జిబాన్ గంగూలీ మరణించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గుండె పోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు 99 ఏళ్లు. 1930లో తంగలుబెరియా పోలీస్ స్టేషన్ ముట్టడించినందుకు రెండేళ్లు, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు మూడేళ్లు జైలు జీవితం గడిపారు. 1946లో కోల్‌కతా, నోవఖలిలో జరిగిన అల్లర్ల సమయంలో గాంధీజీతో కలిసి శాంతియుత ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం గంగూలీ పశ్చిమ్‌బంగా స్వాతంత్ర్య యోధుల సలహాదారుల సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న విధులకు కూడా హాజరయ్యారు. కానీ ఈరోజు గుండెనొప్పితో మరణించారు