ఐదుగురు పాకిస్థానీయులు అరెస్ట్...

 

అక్రమంగా భారత్ లోకి చొరబడిన ఐదుగురు పాకిస్థానీయులను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్ - పాకిస్థాన్ సరిహద్దులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదు మందిని అరెస్టు చేయగా.. వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వారంద‌రినీ ల‌ఖాస‌ర్ గ్రామానికి ద‌గ్గ‌ర‌లోని బార్మ‌ర్ బోర్డ‌ర్ వ‌ద్ద అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఐదు మంది పాకిస్థాన్ నుంచి అక్రమంగా భారత్ భూభాగంలో ప్రవేశించారని భార‌త్‌కి రావ‌డానికి వారివ‌ద్ద ఎటువంటి ప‌త్రాలూ లేవ‌ని తెలిపారు. వారు భార‌త్‌లోకి ఎందుకు వ‌చ్చార‌నే విష‌యంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu