నందిగామలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా నందిగామలోని కంసన్ హైజెనిక్ పరిశ్రమలో  మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.  పరిశ్రమలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షెడ్డులో చెలరేగిన మంటలు క్షణాల్లోనే పరిశ్రమ అంతా వ్యాపించాయి.

అదృష్ట వశాత్తూ ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు.  సమాచారం అందుకున్న  ఫైర్ సిబ్బంది  సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఐదు ఫైర్ ఇంజన్ లతో  అతి కష్టం మీద మంటలను అదుపు చేయగలిగారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో  పరిశ్రమ పూర్తిగా దగ్ధమైంది.