క్యాబరే చేయబోతున్న హీరోయిన్
posted on Nov 25, 2014 9:06AM
ఏ హీరోయిన్ అయినా క్యాబరే చేయబోతుందంటే ఆసక్తి చూపించనివారెవరు. సాధారణంగా హీరోయిన్లు క్యాబరే డాన్స్ చేయమంటే బాబోయ్ అనేస్తారు. అయితే రిచా చద్ధా అనే హీరోయిన్ మాత్రం తాను క్యాబరే చేయడానికి సిద్ధమని ప్రకటించింది. విషయం ఏమిటంటే, మాజీ హీరోయిన్ పూజాభట్ కౌస్తభ్ నారాయణ్ నియోగి దర్శకత్వంలో నిర్మించబోతున్న ‘క్యాబరే’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి రిచా చద్ధా అంగీకరించింది. అందాల ఆరబోతలో సిద్ధహస్తురాలైన రిచా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి న్యాయం చేయగదన్న నమ్మకంతోనే ఆమెను సంప్రదించామని, ఈ సినిమా కథ చెప్పగానే ఆమె ఎగిరి గంతేసి నటించడానికి అంగీకరించిందని దర్శకుడు, నిర్మాత చెబుతున్నారు. ఈ సినిమాలో పూర్తిస్థాయి క్యాబరే డాన్స్ ఉండకపోవచ్చుగానీ ‘ఓ మోస్తరు’గా నైనా క్యాబరే డాన్స్ వుంటుందన్న అభిప్రాయాలు బాలీవుడ్‌లో వ్యక్తమవుతున్నాయి. పూజాభట్ నిర్మించే సినిమా కావడంతో ‘క్యాబరే’ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.