‘సన్నాఫ్ సత్యమూర్తి’ షార్ట్ రివ్యూ
posted on Apr 9, 2015 9:49AM
తెలుగు ప్రేక్షకులు, అభిమానులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్న సన్నాఫ్ సత్యమూర్తి సినిమా గురువారం నాడు విడుదలైంది.. ఆ సినిమా ఫస్ట్ రివ్యూ రిపోర్టు ఇది.. అల్లు అర్జున్, త్రివిక్రమ్, రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, ప్రకాష్ రాజ్, సమంత, నిత్యామీనన్... ఇలా భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా మీద ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను చేరుకుందా.. అధిగమించిందా అనేది చూద్దాం. ‘జులాయి’ తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సెకండ్ కాంబినేషన్ కూడా ఈ సినిమా మీద అంచనాలు పెరగడానికి కారణమైంది.
సినిమా ప్రారంభం అల్లరు అర్జున్ ఈ సినిమా ప్రధాన కథాంశాన్ని చెబుతుండగా జరుగుతుంది. అల్లు అర్జున్ సత్యమూర్తి (ప్రకాష్‌రాజ్) అనే ఒక పెద్ద బిజినెస్మేన్ ఒక్కగానొక్క కుమారుడు. సత్యమూర్తి గారు తన కొడుకు పెళ్ళి అదా శర్మ అనే అమ్మాయితో ఫిక్స్ చేస్తాడు. ఎంగేజ్‌మెంట్ కూడా జరిపిస్తాడు. అయితే ఆ తర్వాత సత్యమూర్తి ఒక ప్రమాదంలో మరణిస్తాడు. ఆ తర్వాత అదాశర్మతో సన్నాఫ్ సత్యమూర్తి పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం చనిపోయిన సత్యమూర్తి ఆస్తుల విషయంలో కొన్ని సందేహాలు ఏర్పడటమే. 3000 కోట్ల ఆస్తిపరుడైన అల్లు అర్జున్ జీవితం తారుమారు అయిపోతుంది. దాంతో అతను వెడ్డింగ్ ప్లానర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. తర్వాత అతని జీవితంలోకి సుబ్బలక్ష్మి అనే సమంత ఎంటరవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ మొదలవుతుంది. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. మాటల మాంత్రికుడిగా పేరు పొందిన దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా ద్వారా ట్విస్టుల మాంత్రికుడు అనిపించుకునే ప్రయత్నం చేశాడు. సినిమాలో కామెడీ పర్లేదనిపించింది. బ్రహ్మానందం కామెడీ మాత్రం ఆశించినంత, ఊహించినంత లేదు. సినిమాటోగ్రఫీ, రీ - రికార్డింగ్ బాగున్నాయి.
అల్లు అర్జున్ నటన బాగుంది. చాలా కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాడు. సమంత కూడా బాగానే నటించింది. రాజేంద్రప్రసాద్ కేరెక్టరైజేషన్ చాలా బాగుంది. ఉపేంద్ర రాకింగ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. స్నేహ, నిత్యామీనన్ కూడా మెప్పించే నటన ప్రదర్శించారు.
ప్లస్సులు
అల్లు అర్జున్
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
సినిమాటోగ్రఫీ
రాజేంద్రప్రసాద్
మైనస్సులు
స్లో నెరేషన్
వీక్ సెకండాఫ్
ఎడిటింగ్
డైరెక్షన్
త్రివిక్రమ్ సినిమా అని నమ్మకంతో వెళ్ళిన వారికి ఆ నమ్మకం నిలబడటం డౌటే.