బస్సు ప్రమాదం.. 24 మంది మృతి

 

బంగ్లాదేశ్‌లోని ఫరిద్పూర్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 24 మంది మరణించారు. బారిసల్ - ఢాకా రహదారిలో తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో ఓ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్ళడంతో ఈ ఘటన జరిగింది. బస్సు అతివేగంలో పోతూ అదుపు తప్పి చాలా చెట్లను ఢీకొన్నట్టు తెలుస్తోంది. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.