కూటమికి వినూత్నంగా రైతుల మద్దతు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రైతులు టీడీపీ, వైసీపీ, బీజేపీ కూటమికి వినూత్నంగా మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన కౌలు రైతులు ఎన్టీయే కూటమి గుర్తులను తమ పొలంలో నారుతో వచ్చేలా చేయడం ద్వారా మద్దతు తెలిపారు. గోంగూర విత్తనాలను క్రమపద్ధతిలో మొలకెత్తించడం ద్వారా సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తుల రూపంలో నారు మొలకెత్తేలా చేశారు. అలాగే ‘ప్రతి చేతికి పని - ప్రతి చేనుకి నీరు’ అనే నినాదం కూడా మొలకెత్తిన నారు ద్వారా కనిపించేలా చేశారు. ‘అత్తోట కౌలు రైతులు’ అనే అక్షరాలు కూడా కనిపించేలా నారును మొలకెత్తించారు. జగన్ ప్రభుత్వ హయాంలో రైతుల జీవితాలు దారుణంగా తయారయ్యాయి. ముఖ్యంగా లాండ్ టైటిల్ చట్టం నుంచి తమను కాపాడేది ఎన్డీయే కూటమేనని రైతులు భావిస్తున్నారు. అందుకే కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు.