ఉత్తుత్తి బాంబు బెదిరింపులు!

తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు సోమవారం బాంబు బెదరింపు కాల్స్ వచ్చాయి. ఆయా విద్యాసంస్థల ఈమెయిల్స్ కు గుర్తు తెలియని వ్యక్తులు బాంబులున్నాయంటూ హెచ్చరికలు పంపారు. దీంతో ఆయా పాఠశాలలు పోలీసులకు సమాచారం ఇచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేయించారు. ఎలాంటి బాంబులూ లేవని నిర్ధారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదరింపు ఈమెయిల్స్ ఎవరు పంపారన్నదానిపై దర్యాప్తు ప్రారంభించారు. ఇలా ఉండగా బాంబు బెదరింపు వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయా విద్యాసంస్థల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.