ఫేస్ బుక్ పై సుప్రీంకోర్టు నోటీసులు...


సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.  ఫేస్ బుక్, వాట్సాప్ లో డేటా భద్రత లేకపోవడం వినియోగదారుడి ప్రైవసీకి దెబ్బతీస్తుందన్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే దీనిపై విచారించిన కోర్టు ప్రైవసీకి కేంద్రం, టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్‌), ఫేస్ బుక్ కు నోటీసులు జారీ చేసింది. దీనిలో రెండు వారాల్లో తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

 

కాగా వాట్సాప్‌ను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసిన తర్వాత వాట్సాప్‌ తన ప్రైవసీ పాలసీని మార్పు చేసింది. వినియోగదారుల అనుమతితో వారి ఖాతా సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకునే విధంగా పాలసీని మార్చింది.