ఈటల స్టొరీ ఎటు పోతోంది? కేసీఆర్ వ్యూహమేంటీ? 

ఈటల రాజేందర్’ తెలంగాణ ఉద్యమంలో, తెరాసలో అత్యంత కీలకపాత్ర పోషించారు. తెరాస తొలి  ప్రభుత్వంలో ఐదేళ్ళు ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించారు. ఆర్థిక మంత్రిగా ఆయన ప్రవేశ పెట్టిన ప్రతి బడ్జెట్’ను ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సహా అధికార పార్టీ నాయకులు అందరూ,అద్భుత్వం, అమోఘం అని కీర్తించారు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ, కరోనా పుణ్యాన ఆర్థిక శాఖ కంటే కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను, నిన్న మొన్నటి వరకు అంతే అద్భుత్వంగా నిర్వహించారు. చివరకు అత్యంత అవమానకరంగా మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్ అయ్యారు. గతంలో ఇదే శాఖను, నిర్వహించిన రాజయ్య తర్వాత ఉద్వాసన (బర్తరఫ్) గురైన రెండవ మంత్రి ఈటల. ఇద్దరి శాఖలు ఒకటి కావడంతో పాటుగా, ఇద్దరూ అవినీతి ఆరోపణలకు ఎదుర్కుని మంత్రి వర్గం నుంచి అవమానకరంగా బర్తరఫ్ కావడం యాదృచ్చికమే కావచ్చును, కాకా పోవచ్చును. కానీ ఇద్దరి మధ్య ఎవరూ కాదనలేని మరో సారూప్యం కూడా ఉంది. ఆ ఇద్దరూ బడుగు,బలహీన వర్గాల నేతలు. రాజయ్య ఎస్సీ అయితే  ఈటల బీసీ. కట్ చేస్తే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఏడేళ్ళ పాలనలో, ఆయన మంత్రి వర్గంలో పనిచేసిన వారిలో, ప్రస్తుత మంత్రివర్గంలో ఈ ఇద్దరే, అవినీతిపరులా, మిగిలి వారందరూ, బంగారు పూసలా? అంటే, అవుననే అమాయకులు, బహుశా ఎవరూ ఉండరు. 

నిజానికి రాజకీయాలు ఖరీదైన వ్యాపారంగా మారిన ఈ కాలంలో మంత్రులనే కాదు,ఎమ్మెల్ల్యేలు, ఎంపీలు, చివరకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సాధారణ రాజకీయ కార్యకర్తలు, నాయకులు, ఏ ఒక్కరూ  కూడా అవినీతి అంటకుండా రాజకీయాల్లో రాణించడం అయ్యేపని కాదు. అందుకే రాజకీయ నీతి అంటేనే అవినీతి అని, రాజకీయ నిఘంటువులు ఘోషిస్తున్నాయి. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలది అదే నీతి. అందుకు తెరాస మినహాయింపు కాదు. 
ఇక ప్రస్తుతం ఈటలపై వేటుకు ప్రధానకారణంగా చూపిస్తున్న అసైన్డ్, దేవాలయాల భూములు  కుంభకోణం విషయాన్నే తీసుకుంటే, ఇదొక అంతులేని కథ అవుతుంది. తవ్విన కొద్దీ కళేబరాలు బయట పడుతూనే ఉంటాయి. 

నిజానికి దళిత,గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు జరపడం చట్ట రీత్యా నేరం. ఇతరత్రా ప్రజోపయోగ కార్యక్రమాలకు అవసరం అయినప్పుడు ఆ భూములను వెనక్కు తీసుకుని  అందుకు ప్రత్యాన్మాయంగా మరొక చోట భూమి ఇచ్చే అధికారం ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది, అన్యులు, ఎంతవారైనా ఆ భూముల జోలికి వెళ్ళరాదని చట్టం చెపుతోంది. అయితే, స్వాతంత్రం వచ్చిన నాటిటి నుంచి ఇప్పటివరకు దళిత, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూముల్లో ప్రభుత్వాలు తిరిగి తీసుకున్న భూములను తీసివేసినా, మిగిలిన భూముల్లో, ఇప్పటికే కనీసం తక్కువలో తక్కువ ఓ యాభై శాతానికి మించి చేతులు మారిపోయాయి. ఇక దేవాలయ భూములు, వక్ఫ్ భూముల విషయం అయితే చెప్పనే అక్కరలేదు.ఇలాంటి పరిస్థితులలో, అసైన్డ్ భూములు అక్రమించారనే ఆరోపణపై, ఒక సీనియర్ మంత్రికి మంత్రివర్గం నుంచి  ఉద్వాసన పలకడం, నిజంగా నవ్వు తెప్పించే విషయమే. నిజానికి, అసైన్డ్ భూముల ఆక్రమణల కారణంగా, చర్య్లాఉ తీసుకోవడం మొదలు పెడితే, మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలలో కనీసం తక్కువలో తక్కువ సగం మంది ఉద్వాసనకు గురవుతారు.   

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా, ఈటల మీద వచ్చిన ఆరోపణల విషయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చకా చకా పావులు కదిల్చారు. కొరడా ఝుళిపించారు. అధికారులు, 24 గంటలు తిరగకుండానే, ప్రాధమిక విచారణ పూర్తి చేశారు. అవును ఈటల అసైన్డ్ భూములను అక్రమించారు, పనిలో పనిగా అటవీ నిబంధనలను ఉల్లంఘించి చెట్లు నరికారు, దేవాలయ భూములను ఆక్రమించుకున్నారు’ అంటూ తదుపరి చర్యలకు అవసరమైన విధంగా నివేదికలను సిద్ధం చేశారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగింది, ఏమి జరుగుతోంది అనేది, అందరికి తెలిసిన విషయమే. 
అయితే, ఇదంతా రాజకీయ చదరంగం. ఈ క్రీడలో ప్రస్తుతం  కేసీఆర్’ కింగ్.  ఎప్పుడు ఎక్కడ అట మొదలు పెట్టాలో, ఎక్కడ ‘బ్రేక్’ ఇవ్వాలో, ఎక్కడ కామా పెట్టాలో, ఎక్కడ చుక్క పెట్టాలో ఆయనకు తెలిసి నంతగా ఇంకెవరికీ తెలియదు. ఈటల వ్యవహారంలో ఇంతవరకు జరిగిన కథను, ఒక్కసారి రీవైండ్ చేసి చూస్తే, కోర్ట్ జోక్యం సహా ప్రతి ఎపిసోడ్’లో కేసీఆర్, కోరుకున్నదే జరిగింది. ఆయనకు కావాల్సింది ఏదైతే వుందో, అది ఆయన ఖాతాలో చేరిపోయింది. ఇప్పటికి ఆయనే విజేత. ఇక పై ఏది జరిగినా, రాజకీయంగా ఆయనకు వచ్చే నష్టం ఏదీ ఉండదు. 

ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళ కుంభకోణం, కూకటపల్లి పల్లి భూముల కుంభకోణం, నయీం నేరాలు, ఇంకా అనేక భూభాగోతాలు, ఇతర అవినీతి అక్రమాలకు సంబంధించి, అన్నిటినీ మించి ఏడేళ్ళ క్రితం మొదలైన, నోటుకు ఓటు కేసు ఇంకా , నడుస్తూనే ఉన్నాయి. రాజకీయంగా అవసరం అయిన కాడికి ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఈటల’ అవినీతి, విచారణ  చేరింది. ఇది మరో అంతులేని కథలా సాగుతుంది. అంతకు మించే, ఎదో జరిగిపోతుంది, అనుకోవడం అయితే మన అజ్ఞానం, కాదంటే అమాయకత్వం.అలాగే, రాజకీయ సమికరణలను, ఈటల వ్యవహారం తల్లకిందులు చేస్తుందని అనుకోవడం కూడా అంతే ...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu