కెన్యాలో ఎబోలా.. తెలుగు వ్యక్తి మృతి
posted on Aug 21, 2014 6:16PM

ఆఫ్రికన్ దేశాలను ప్రమాదకరమైన ఎబోలా వైరస్ గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వైరస్ కారణంగా కెన్యాలోని ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించారు. మృతుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిటుకురాళ్లు గ్రామానికి చెందిన గజేందర్ రెడ్డిగా గుర్తించారు. ఈయనకు నాలుగు రోజుల క్రితం ఈ వైరస్ సోకిందని తెలుస్తోంది. వైరస్ కారణంగా విషజ్వరం పెరిగిపోయి ఆయన మరణించినట్టు తెలుస్తోంది. గజేందర్‌రెడ్డి భార్యాపిల్లలు కెన్యా నుంచి స్వదేశానికి బయల్దేరి గురువారం ఉదయం 10 గంటలకు బెంగళూరుకు వచ్చారు. అయితే వారు ఆరోగ్యంగా వున్నట్టు తెలుస్తోంది. ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియార్రా లియోన్, నైజీరియా దేశాల్లో ప్రబలిన భయానకమైన ఎబోలా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 1,229కి చేరినట్టు తెలుస్తోంది.