నేపాల్ ను కుదిపేసిన భూకంపం.. 128 మంది మృతి

నేపాల్‌ భీరీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత6.4గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా నేపాల్ లో వందల సంఖ్యలో మరణాలు సంభవించాయని చెబుతున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య 128 అని ప్రకటించినప్పటికీ.. ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 పశ్చిమ నేపాల్‌లోని జాజర్‌కోట్ ,రుకుమ్ జిల్లాల్లో  భారీ నష్టం సంభవించినట్లు చెబుతున్నారు.   జాజర్‌కోట్‌లోని లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు  తెలిపారు. శుక్రవారం అర్ధ రాత్రి సంభవించిన ఈ భూ కంప ప్రకంపనలు ఢిల్లీ సహా ఉత్తర భారతంలోనూ కనిపించాయి.  

భూకంపం వల్ల దైలేఖ్, సల్యాన్, రోల్పా జిల్లాలతో సహా పలు జిల్లాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. హిమాలియన్ నేషన్ అయిన నేపాల్ లో  తరచుగా భూకంపాలు సంబవిస్తుంటాయి. గతంలో అంటే నవంబర్ 2022 లో దోటి జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించి ఆరుగురు మరణించారు. అంతకు ముందు 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల పన్నెండు వేల మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu