ఒబామాకి ఇ-మెయిల్ ఇవ్వబోయాడు... అరెస్ట్..
posted on Jan 25, 2015 12:24PM

భారతదేశంలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకి ఇ-మెయిల్ ఇద్దామని బీహార్‌లోని గయకి చెందిన ఇనాం రజా అనే 50 ఏళ్ళ వ్యక్తి భావించాడు. ఓ ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్ళి ఉర్దూలో రెండు పేజీల లేఖ కూడా రాశాడు. ఇంతలో ఆ ఇంటర్నెట్ సెంటర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. సదరు ఇనాం రజా ఉర్దూలో నేషనల్ రిలీఫ్ ఫండ్ కోసం 130 కోట్ల డాలర్ల నిధులు ఇవ్వాలని కోరుతూ లేఖ రాశాడు. అయినప్పటికీ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. రజా గత కొంతకాలంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నాడట. అతన్ని ముందు జాగ్రత్త చర్యగానే అరెస్టు చేశామని, ఒబామా పర్యటన ముగిసిన తర్వాత విడుదల చేస్తామని పోలీసులు చెబుతున్నారు.