అలా వచ్చాడు.. వార్నింగ్ ఇచ్చాడు..

 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంగతి అందరికీ తెలిసిందే. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పడం.. ఎవరేమనుకున్నా తను అనుకున్నది చేయడం అతనికి పరిపాటి. ఇప్పుడు ఆయన పక్కనున్న అధికారులు కూడా ఆయనలాగే ఉండాలని పెట్టుకున్నారేమో..  ట్రంప్‌కు కొత్తగా కమ్యునికేషన్స్‌ చీఫ్‌గా నియమితులైన ఆంటోనీ స్కార్‌ముస్సి వచ్చి రాగానే శ్వేతసౌదంలోని అధికారులకు వార్నింగ్ లు ఇచ్చారు. వైట్ హౌస్ నుండి సమాచారం బయటకు వెళుతున్న నేపథ్యంలో దీనిపై స్పందించిన ఆంటోనీ 'నా ముందున్న పనుల్లో నేను చేయాలనుకుంటున్న తొలికార్యం లీకులను ఆపేయడం.. దయచేసి శ్వేతసౌదం నుంచి లీకులు ఇవ్వడాన్ని ఆపేయండి. తగిన అనుమతులు తీసుకోకుండా ఎవరైతే మీడియాకు లీకులు ఇస్తారో వారిపై మాత్రం చాలా కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. నిజంగా మీరు శ్వేతసౌదంలో పనిచేయాలని అనుకుంటే లీకులు ఆపండి' అని హెచ్చరించారు.