దివ్వెల మాధురికి రిమాండ్!
posted on Aug 12, 2024 12:17PM
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో సహజీవనం చేస్తూ, ఆ కుటుంబ వివాదంలో కేంద్ర బిందువులా మారి, ఆత్మహత్యా ప్రయత్నం చేసిన వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హైవే మీద వేగంగా కారు నడిపి, ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో మరో కారుని ఢీకొట్టిన విషయం తెలిసిందే. మొదట లారీని కొట్టాలని అనుకున్న మాధురి పాపం లారీలో వాళ్ళకి ఏమైనా అవుతుందని జాలిపడిందో ఏమోగానీ, కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురి కారు, మాధురి ఢీకొట్టిన కారు రెండూ బోల్తాపడ్డాయి. అదేం ఖర్మోగానీ, ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేసిన దివ్వెల మాధురి నిక్షేపంలా వుంది. ఆస్పత్రిలోనే మీడియాతో చాలా ఫెరోషియస్‌గా మాట్లాడుతోంది. తన ‘ఆయనకిద్దరు’ వ్యవహారానికి రాజకీయ రంగు పులమటానికి శాయశక్తులా కృషి చేస్తోంది. మాధురి ఢీకొట్టిన కారులో వున్నవాళ్ళు మాత్రం పాపం, ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య వున్నారు. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చినట్టుగా తయారైంది వాళ్ళ పరిస్థితి. వీళ్ళు వీళ్ళు సంబంధాలు పెట్టేసుకోవడమేంటో.. గొడవలు పడటం ఏంటో.. అనవసరంగా ఆ కారులో వున్నవాళ్ళు సమస్యల్లో పడ్డారు. ఇదిలా వుంటే, దివ్వెల మాధవిని ఇంకా పోలీసులు అరెస్టు చేయలేదు. ఇవాళో రేపో ఆ అరెస్టు కార్యక్రమం జరిగే అవకాశం వుంది. యాక్సిడెంట్ చేసినందుకు, ఆత్మహత్యా ప్రయత్నం చేసినందుకు దివ్వెల మాధురిని రిమాండ్‌కి తరలించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.