తేజ తప్పు చేస్తున్నాడు

 

చాలా కాలం తర్వాత దర్శకుడు తేజ మళ్ళీ తన బ్యానర్ ను ఓపెన్ చేస్తున్నాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించబోతున్న కొత్త చిత్రం "తప్పు". ఈ చిత్రాన్ని చిత్రం మూవీస్ బ్యానర్లో నిర్మిస్తున్నాడు. అంతా కొత్తవాళ్ళతో ఈ సినిమా చేయబోతున్నారు. "సమాజానికి కొన్ని సరిహద్దులుంటాయి. ఆ హద్దులతో చేలగాటమే ఈ సినిమా. అంతకుమించి వివరాలు చెప్పను" అని తేజ అన్నారు. ఈ సినిమాకు కళ్యాణీ కోడూరి సంగీతం అందిస్తున్నారు. పెద్దాడమూర్తి పాటలు రాస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu