తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (అక్టోబర్ 1)ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ ఆక్టోబస్ బిల్డింగ్ వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శననానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (సెప్టెంబర్ 30) శ్రీవారిని 87వేల 081 మంది దర్శించుకున్నారు. వీరిలో 41వేల 575 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శరీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 5లక్షల  రూపాయలు వచ్చింది.