తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజెనోవో
posted on Apr 13, 2025 10:41PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజెనోవో ఆదివారం తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఇటీవల సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తన కుమాడుకు కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంటానని మొక్కుకున్నఅన్నా లెజనోవో.. మార్క్ శంకర్ కోలుకోవడంతో అన్నా లెజెనోవో ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి మొక్కు తీర్చుకున్నారు.
ఆమె తిరుమల పర్యటన సందర్భంగా విదేశీయులు, ఇతర మతాలను ఆచరించేవారు.. తిరుమలకు వచ్చినప్పుడు ఎలాంటి సంప్రదాయాలు పాటించాలో వాటిని ఖచ్చితంగా పాటించారు. తిరుమలలోనే ఆమె తిరుమల స్వామివారిపై నమ్మకం ఉందంటూ డిక్లరేషన్ ఇచ్చారు. తొలుత గాయత్రి నిలయం అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు..ప్రొటోకాల్ ప్రకారం.. అధికారులు స్వాగతం పలికారు.