లాతూర్‌కి కేజ్రీవాల్ జలదానం

మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్న లాతూరు మునుపెన్నడూ లేనంత తీవ్ర కరువుతో అల్లాడిపోతోంది. ప్రజలకు, పశువులకు గుక్కెడు నీరు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాగేందుకు చుక్కనీరు లేక గొంతెండుతున్న లాతూర్‌ని ఆదుకోవడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముందుకొచ్చారు. ఢిల్లీ తరపున లాతూరులోని సోదర సోదరీమణులకు రెండు నెలల పాటు రోజుకి 10 లక్షల లీటర్ల నీళ్లు అందిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు.